అక్కినేని నాగార్జున గ్లామర్ అండ్ హెల్త్ సీక్రెట్స్

194

హీరో అక్కినేని నాగార్జున వయసు ఇప్పుడు 59 ఏళ్ళు. అంత వయసు ఉంటుందని తెలిసినా మనకు ఆశ్చర్యమే కలుగుతుంది. ‘నా చర్మం నా వయసుని అస్సలు తెలియనివ్వడం లేదు’ అనే ‘రెక్సోనా’ సబ్బు ప్రకటన లాగా నాగార్జునను చూస్తే అస్సలు వయసు తెలియదు. నాగ్, నాగచైతన్య, అఖిల్ పక్క పక్క న నిలబడితే ముగ్గురూ అన్నదమ్ముల్లాగానే అనిపిస్తారు. నాగార్జున ఫేస్ లో ఏజ్ కనపడదు. నాగార్జున ఎప్పుడూ లావుగా మారిన దాఖలాలు లేవు. అంతలా తన గ్లామర్ ని, హెల్త్ ని నాగార్జున చాలా కేర్ ఫుల్ గా మెయింటైన్ చేస్తుంటారు. నాగార్జున పాటించే గ్లామర్ అండ్ హెల్త్ సీక్రెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ..

రోజూ ఉదయం ఐదున్నరకే నిద్ర లేస్తారు. రాత్రి పది గంటల లోపే నిద్ర పోతారు.

‘శివ’ సినిమా టైమ్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘చాలా సన్నగా ఉన్నావ్ .. ఇంకా స్ట్రాంగ్ గా కనపడాలి ‘ అని చెప్పాడట . అప్పట్లో జిమ్ లాంటివి లేవు. దాంతో పుస్తకాలు చదివి , డాక్టర్స్ ని అడిగి ఫుడ్ సెట్ చేసుకున్నారు. దాన్నే ఇప్పటికి ఫాలో అవుతుంటారు.

రోజుకి 8 , 9 గంటలు కంపల్సరీ నిద్రపోవాలన్నది నాగ్ నమ్మే రూల్. సరిగ్గా నిద్ర పోకపోయినా, ఎక్కువ వత్తిడికి గురైనా అన్నీ జబ్బులు వచేస్తాయంటారు నాగ్.

మార్నింగ్ ఒక గ్లాస్ నీళ్లలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని, ఓ 15 నిమిషాల తర్వాత తాగుతారు.

రోజు ఓ అల్లం ముక్క తప్పని సరిగా నములుతారు.

ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ కి వీలైనంత దూరంగా ఉంటారు. మసాలా లు ఎక్కువగా వాడరు. ముఖ్యంగా గరం మసాలా విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ మసాలా ను ఎక్కువగా మాడ్చేస్తే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఎక్కువగా ఫ్రై చేస్తే దాదాపు విషం అనే చెప్పాలి. అందుకే గరం మసాల విషయం లో నాగ్ చాలా కేర్ చూపిస్తారు.

నాగ్ కి పచ్చి మిరపకాయలు నూరి చేసే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. బీరకాయ, వంకాయ, బీట్ రూట్ పచ్చళ్ళు బాగా తింటారు. బీరకాయ తొక్కలతో చేసే పచ్చడి అంటే బాగా ఇష్ట పడతారు. ఆ తొక్కుల్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదా.

మరీ నిల్వ చేసిన పచ్చళ్ళు తినరు. ఏ ఊరగాయ పచ్చడైన చేసిన తర్వాత ఒకటి, రెండు నెలలు వరకూ మాత్రమే తింటారు.

మొదట్లో వెయిట్ లిఫ్టింగ్ బాగా చేసేవారు. తర్వాత బాడీ ఫిట్ గా ఉండాలంటే ‘యోగా; చేస్తే మంచిదని, దానిని ఫాలో అవుతున్నారు. హాలిడే ట్రిప్ కి వెళ్లినా కూడా యోగా చేయడం మానరు.

నాగ్ ఇప్పుడిలా కనపడడానికి కారణం 50 శాతం వ్యాయామాలు, 50 శాతం డైట్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here