అకాల వర్షాల బాధిత రైతులకు నష్టపరిహారం!

బాధిత రైతులందరికీ ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో నష్టపరిహారం అందజేయనున్నట్లు మంత్రులు తెలిపారు. మొక్క జొన్న, జొన్న పంటల కొనుగోలులో ప్రతి రైతుకూ 100 క్వింటాళ్ల కు రూ.200ల చొప్పున 20 వేల రూపాయలను అదనంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద అందజేయనున్నట్లు రాష్ట్ర మార్కెట్, గిడ్డంగుల శాఖ మంత్రి సీహెచ్. ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సీహెచ్.ఆదినారాయణరెడ్డి మాట్లాడారు.

ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..

మార్చి 16 వ తేదీ నుంచి ఈ నెల 2 వ తేదీ వరకూ వడగల్లుతో కూడిన గాలివానల వల్ల 21,693 ఎకరాల్లో వ్యవసాయం, హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయన్నారు.

దీనివల్ల రూ.56 కోట్లకు పైగా రైతులకు నష్టం కలిగిందన్నారు. 8 ఎకరాలకు పైగా ఉన్న పంట భూముల్లో రూ.39.5 కోట్ల విలువైన సాధారణ వ్యవసాయ సాగవుతున్న వరి

తదితర పంటలు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నాయన్నారు.

హార్టికల్చర్ లో సాగవుతున్న 13,424 ఎకరాల్లోరూ.17 కోట్లకు పైగా పంటలకు నష్టం కలిగిందన్నారు.

ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటయినా ప్రత్యేక బృందాల ద్వారా ఏరోజుకారోజు మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

పూర్తి వివరాలు రాగానే నిబంధనల ప్రకారం బాధిత రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం అందజేస్తామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మూడున్నరేళ్లలో రూ.2,075 వేల కోట్లకుపైగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేశామన్నారు.

సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
ఎం.ఐ.పి.లో ఏపీ నెం.1…

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఎం.ఐ.పి.లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానం లో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

రెండో స్థానంలో కర్నాటక, మూడో స్థానంలో గుజరాత్ నిలిచిందన్నారు. గతేడాది దేశంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.

మొక్కజొన్న, జొన్న 100 క్వింటాళ్లకు రూ.20 వేలు…

మొక్క జొన్న, జొన్న పంటలకు గిట్టుబాటు ధరలు లేని కారణంగా రైతులకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినట్లు రాష్ట్ర మార్కెట్,

గిడ్డంగుల శాఖ మంత్రి సీహెచ్. ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే రైతులను నుంచి వ్యాపారులు మొక్క జొన్న, జొన్న కొనుగోలు చేస్తున్నారన్నారు.

మార్కెట్ ధర కంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రతి రైతుకూ 100 క్వింటాళ్లకు గానూ రూ.200ల చొప్పున రూ.20 వేలు అదనంగా ఇవ్వనున్నట్లు మంత్రి ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *