అంబేద్కర్ దార్శనికతతోనే దేశాభివృద్ధి సీఎం చంద్రబాబు

35

ఆధునిక భారత దేశ అభివృద్ధికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దార్శనికత ఎంతగానో తోడ్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన సేవలను సీఎం ప్రస్తుతించారు. అనాదిగా దళితులు అభివృద్ధికి దూరంగా ఉన్నారని, దళితుల సముద్ధరణకు తాము అంబేద్కర్ స్మృతి వనంతో పునాది వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

రూ. 100 కోట్ల వ్యయంతో నెలకొల్పే స్మతివనం దళితుల అభ్యున్నతికిగాను రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు స్ఫూర్తిదాయక చిహ్నంగా నిలవబోతోందని వివరించారు.
అంబేద్కర్ దళితులకు ఆశాజ్యోతి అని,

దేశ ప్రగతికి దిక్సూచి అని అభివర్ణించారు. ఈ దేశానికి బుద్ధుని తాత్వికత కావాలని, అంబేద్కర్ దార్శనికత అవసరమని చెప్పారు.

ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ స్ఫూర్తితో పనిచేస్తే సమత, మమతలు వెల్లివిరియటం ఖాయమని తెలిపారు.

దేశంలో బహుళార్ధసాధక ప్రాజెక్టుల రూపకల్పనకు అంబేద్కర్ కృషిచేశారని, సాంఘిక అసమానతలను, వివక్షను నిరసించారని అన్నారు. స్వతంత్ర భారత మంత్రివర్గంలో తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయన చట్టసభల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలని వాదించారని చంద్రబాబు తెలిపారు.

కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా అందరి ఉపాధికి ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజీల స్థాపనలో కేంద్రమంత్రిగా కృషి చేశారని చంద్రబాబు తెలిపారు.

2018-19 ఆర్ధిక సంవత్సరంలో తమ ప్రభుత్వం ఎస్.సి ఎస్.పి పథకం కింద 11228.11 కోట్లు కేటాయించిందని, గత ఏడాదికంటే ఇది రూ1381 కోట్లు అధికమని ముఖ్యమంత్రి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here