టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు. ‘కెరీర్ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియో పెట్టాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టుకు తొలిసారి ధోని నాయకత్వం వహించాడు. పాకిస్థాన్‌పై జరిగిన ఉత్కంఠ పోరులో ధోని సేన విజయం సాధించింది. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ధోని తొలిసారి కెప్టెన్ అయ్యాడు. 2008లో టెస్ట్ సిరీస్ నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించగా అనిల్ కుంబ్లే గాయపడటంతో అప్పటివరకూ వైస్ కెప్టెన్‌గా ఉన్న ధోని పూర్తి స్థాయి టెస్ట్ టీమ్‌కు నాయకుడు అయ్యాడు. ధోని నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు 2009 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరుకుంది.